- ‘రైతు నేస్తం’ కార్యక్రమంలో పాల్గొనాలని జిల్లా వ్యవసాయ అధికారి స్వరూపరాణి పిలుపు
సిద్దిపేట, అక్టోబర్ 12 (చైతన్యగళం): ఎల్‌నినో పరిస్థితులు, రబీ పంటల ప్రణాళిక, అనువైన పంటల ఎంపిక, పంటల సాగులో అనుసరించాల్సిన యాజమాన్య పద్ధతులపై రైతులకు అవగాహన కల్పించే ఉద్దేశంతో సోమవారం మధ్యాహ్నం 12 గంటలకు ‘రైతు నేస్తం’ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు జిల్లా వ్యవసాయ అధికారి స్వరూపరాణి తెలిపారు.
ఈ కార్యక్రమం ద్వారా తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్‌రెడ్డి రాష్ట్రంలోని రైతులతో ముఖాముఖి మాట్లాడి సందేశం ఇవ్వనున్నట్లు ఆమె ఒక ప్రకటనలో పేర్కొన్నారు. జిల్లాలోని రైతులందరూ తమ సమీపంలోని రైతు వేదికలకు చేరుకుని ఈ కార్యక్రమంలో పాల్గొనాలని కోరారు.
ఎల్‌నినో పరిస్థితుల నేపథ్యంలో రాబోయే రబీ సీజన్‌కు తగిన పంటలను ఎంపిక చేసుకోవడం, సమర్థవంతమైన పంటల ప్రణాళికను రూపొందించుకోవడం, సాగులో అనుసరించాల్సిన యాజమాన్య పద్ధతులపై అవగాహన పెంపొందించుకోవడానికి ఈ కార్యక్రమం ఉపయోగపడుతుందని తెలిపారు.
