Tuesday, October 13, 2026
Homeతెలంగాణసాహిత్య సేవకు జాతీయస్థాయి గుర్తింపు

సాహిత్య సేవకు జాతీయస్థాయి గుర్తింపు

📰 Generate e-Paper Clip

  • సమ్మెట వెంకటేశ్వర్లుకు స్వర్ణ కంకణం, గోల్డ్ మెడల్ ప్రదానం

మహబూబాబాద్, అక్టోబర్ 11(చైతన్యగళం): సాహిత్య రంగంలో విశేష కృషి చేస్తున్న మహబూబాబాద్‌కు చెందిన సమ్మెట వెంకటేశ్వర్లుకు జాతీయస్థాయి 2026 విజయదశమి పురస్కారం లభించింది. హైదరాబాద్‌లోని చిక్కడపల్లి త్యాగరాయ గానసభ సంగీత నాట్య కళావేదికలో ఆదివారం నిర్వహించిన కార్యక్రమంలో ఆయనకు స్వర్ణ కంకణం, గోల్డ్ మెడల్, పురస్కార పత్రం, మెమెంటో అందజేసి ఘనంగా సత్కరించారు.

శ్రీ గౌతమేశ్వర సాహితీ కళా సేవా సంస్థ ఆరో వార్షికోత్సవాల సందర్భంగా ఈ పురస్కార ప్రదానోత్సవాన్ని నిర్వహించారు. రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన వివిధ రంగాల్లో సేవలందిస్తున్న 39 మందికి జాతీయస్థాయి 2026 విజయదశమి పురస్కారాలను ప్రదానం చేశారు.

ఈ సందర్భంగా సమ్మెట వెంకటేశ్వర్లును దుశ్శాలువతో సత్కరించి, సాహిత్య రంగంలో ఆయన చేస్తున్న కృషిని గుర్తించి పురస్కారాన్ని అందజేశారు. సంస్థ అధ్యక్షుడు డా. దూడపాక శ్రీధర్, అక్షర సమీక్ష దినపత్రిక సంపాదకురాలు, సామాజిక కార్యకర్త అంక విజయదుర్గా భవానీ, వినాయక ఫౌండేషన్ అధ్యక్షుడు డా. దీటి గోపాలకృష్ణయ్య తదితరుల చేతుల మీదుగా ఆయన ఈ సత్కారాన్ని అందుకున్నారు.

సాహిత్య రంగంలో అందించిన సేవలకు జాతీయస్థాయి గుర్తింపు లభించడం పట్ల సాహితీ అభిమానులు, పలువురు శుభాకాంక్షలు తెలిపారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install CG News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!