సాహిత్య సేవకు జాతీయస్థాయి గుర్తింపు
సమ్మెట వెంకటేశ్వర్లుకు స్వర్ణ కంకణం, గోల్డ్ మెడల్ ప్రదానం మహబూబాబాద్, అక్టోబర్ 11(చైతన్యగళం): సాహిత్య రంగంలో విశేష కృషి చేస్తున్న మహబూబాబాద్కు చెందిన సమ్మెట వెంకటేశ్వర్లుకు జాతీయస్థాయి 2026 విజయదశమి పురస్కారం లభించింది. హైదరాబాద్లోని చిక్కడపల్లి త్యాగరాయ గానసభ సంగీత నాట్య కళావేదికలో ఆదివారం నిర్వహించిన కార్యక్రమంలో ఆయనకు స్వర్ణ కంకణం, గోల్డ్ మెడల్, పురస్కార పత్రం, మెమెంటో అందజేసి ఘనంగా సత్కరించారు. శ్రీ గౌతమేశ్వర సాహితీ కళా సేవా సంస్థ ఆరో వార్షికోత్సవాల సందర్భంగా ఈ పురస్కార ప్రదానోత్సవాన్ని నిర్వహించారు. రెండు తెలుగు...