Wednesday, October 7, 2026
Homeతెలంగాణకరీంనగర్బతుకమ్మ టెండర్‌ను రద్దు చేసి రీటెండర్‌ నిర్వహించాలి

బతుకమ్మ టెండర్‌ను రద్దు చేసి రీటెండర్‌ నిర్వహించాలి

📰 Generate e-Paper Clip

  • రూ.15 లక్షల టెండర్‌పై బీఆర్‌ఎస్‌ నాయకుడు అయిలేని మల్లికార్జునరెడ్డి ప్రశ్న

హుస్నాబాద్‌, అక్టోబరు 6 (చైతన్యగళం): బతుకమ్మ పండుగ ఏర్పాట్ల కోసం హుస్నాబాద్‌ మున్సిపల్‌ అధికారులు నిర్వహించిన రూ.15 లక్షల టెండర్‌ను రద్దు చేసి పారదర్శకంగా రీటెండర్‌ నిర్వహించాలని బీఆర్‌ఎస్‌ నియోజకవర్గ నాయకుడు అయిలేని మల్లికార్జునరెడ్డి డిమాండ్‌ చేశారు. ఈ మేరకు మంగళవారం ప్రకటన విడుదల చేశారు.

ఎల్లమ్మ చెరువు కట్టపై ఇప్పటికే సుందరీకరణలో భాగంగా విద్యుద్దీపాల ఏర్పాటు, సీసీ రోడ్ల నిర్మాణం చేపట్టారని తెలిపారు. ఈ నేపథ్యంలో టెంట్లు, మైక్‌సెట్ల వంటి ఏర్పాట్లకు రూ.15 లక్షల టెండర్‌ అవసరం ఏమిటని ప్రశ్నించారు. ప్రతి ఏడాది బతుకమ్మ ఏర్పాట్ల పేరుతో ప్రజాధనం వృథా అవుతోందని ఆరోపించారు. టెండర్‌ నిర్వహణపై అధికారులు స్పష్టత ఇవ్వాలని, ప్రజాధనం వృథా చేస్తే పోరాటం చేపడతామని హెచ్చరించారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install CG News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!