బతుకమ్మ టెండర్‌ను రద్దు చేసి రీటెండర్ నిర్వహించాలి
రూ.15 లక్షల టెండర్‌పై బీఆర్‌ఎస్ నాయకుడు అయిలేని మల్లికార్జునరెడ్డి ప్రశ్న హుస్నాబాద్, అక్టోబరు 6 (చైతన్యగళం): బతుకమ్మ పండుగ ఏర్పాట్ల కోసం హుస్నాబాద్ మున్సిపల్ అధికారులు నిర్వహించిన రూ.15 లక్షల టెండర్‌ను రద్దు చేసి పారదర్శకంగా రీటెండర్ నిర్వహించాలని బీఆర్‌ఎస్ నియోజకవర్గ నాయకుడు అయిలేని మల్లికార్జునరెడ్డి డిమాండ్ చేశారు. ఈ మేరకు మంగళవారం ప్రకటన విడుదల చేశారు. ఎల్లమ్మ చెరువు కట్టపై ఇప్పటికే సుందరీకరణలో భాగంగా విద్యుద్దీపాల ఏర్పాటు, సీసీ రోడ్ల నిర్మాణం చేపట్టారని తెలిపారు. ఈ నేపథ్యంలో టెంట్లు, మైక్‌సెట్ల వంటి ఏర్పాట్లకు...