Monday, October 5, 2026
Homeతెలంగాణకరీంనగర్భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం

భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం

📰 Generate e-Paper Clip

  • భూ భారతి రీ-సర్వేను పరిశీలించిన కలెక్టర్‌ హైమావతి

అక్కన్నపేట, అక్టోబర్‌ 5 (చైతన్యగళం): భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపడమే లక్ష్యంగా చేపట్టిన భూ భారతి రీ-సర్వేను పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్‌ కె. హైమావతి అధికారులను ఆదేశించారు. సోమవారం అక్కన్నపేట మండలం కేశవాపూర్‌ గ్రామంలో కొనసాగుతున్న రీ-సర్వే ప్రక్రియను రెవెన్యూ డివిజన్‌ అధికారి రామ్మూర్తితో కలిసి ఆమె క్షేత్రస్థాయిలో పరిశీలించారు.

గ్రామ సరిహద్దులను పారదర్శకంగా, కచ్చితత్వంతో నిర్ధారించాలని కలెక్టర్‌ సూచించారు. ప్రభుత్వ భూములను గుర్తించి వాటి చుట్టూ హద్దురాళ్లు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. భూమి విస్తీర్ణం, సర్వే నంబర్లు, హద్దులు, పట్టా వివరాలను రెవెన్యూ రికార్డులతో సరిపోల్చి ఎలాంటి తప్పిదాలకు తావులేకుండా నమోదు చేయాలని తహసీల్దార్‌కు సూచించారు.

రీ-సర్వే ప్రక్రియను వేగవంతం చేసేందుకు రూ.6–7 లక్షల వ్యయంతో ఆధునిక రోవర్‌ యంత్రాలను కొనుగోలు చేస్తున్నట్లు కలెక్టర్‌ తెలిపారు. అనంతరం రైతులతో మాట్లాడి రీ-సర్వే వివరాలను అడిగి తెలుసుకున్నారు. భూ హక్కుదారులు రీ-సర్వే ప్రక్రియలో అధికారులకు పూర్తిస్థాయిలో సహకరించాలని కోరారు.

కార్యక్రమంలో తహసీల్దార్‌ మధుసూదన్‌, సర్వే అధికారులు, ప్రజాప్రతినిధులు, గ్రామస్తులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install CG News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!