భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం

భూ భారతి రీ-సర్వేను పరిశీలించిన కలెక్టర్‌ హైమావతి అక్కన్నపేట, అక్టోబర్‌ 5 (చైతన్యగళం): భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపడమే లక్ష్యంగా చేపట్టిన భూ భారతి రీ-సర్వేను పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్‌ కె. హైమావతి అధికారులను ఆదేశించారు. సోమవారం అక్కన్నపేట మండలం కేశవాపూర్‌ గ్రామంలో కొనసాగుతున్న రీ-సర్వే ప్రక్రియను రెవెన్యూ డివిజన్‌ అధికారి రామ్మూర్తితో కలిసి ఆమె క్షేత్రస్థాయిలో పరిశీలించారు. గ్రామ సరిహద్దులను పారదర్శకంగా, కచ్చితత్వంతో నిర్ధారించాలని కలెక్టర్‌ సూచించారు. ప్రభుత్వ భూములను గుర్తించి వాటి చుట్టూ హద్దురాళ్లు ఏర్పాటు చేయాలని ఆదేశించారు....