Monday, October 5, 2026
Homeభక్తి - ఆధ్యాత్మికతపెరుమాండ్ల ఆంజనేయస్వామి ఆలయానికి 5 గుంటల భూమి కేటాయించాలి

పెరుమాండ్ల ఆంజనేయస్వామి ఆలయానికి 5 గుంటల భూమి కేటాయించాలి

📰 Generate e-Paper Clip

యాచారం, అక్టోబర్‌ 5 (చైతన్యగళం): యాచారం మండలం మేడిపల్లిలోని అతి పురాతన పెరుమాండ్ల ఆంజనేయస్వామి ఆలయానికి ఐదు గుంటల భూమిని కేటాయించాలని కోరుతూ నక్కర్త–మేడిపల్లి పీఆర్‌జీ ఫౌండేషన్‌ అధ్యక్షుడు ప్రొద్దుటూరి రవీందర్‌ గుప్త, పలెచెల్కతండా మాజీ సర్పంచ్‌ లోక్య నాయక్, యాచారం మండల విశ్వహిందూ పరిషత్‌ అధ్యక్షుడు నాళ్ల మురళీకృష్ణ, పలెచెల్కతండాకు చెందిన బావోజీ నారాయణ నాయక్‌ సోమవారం తహసీల్దార్‌ అయ్యప్పకు వినతిపత్రం అందజేశారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. చారిత్రక ప్రాధాన్యమున్న పెరుమాండ్ల ఆంజనేయస్వామి ఆలయ అభివృద్ధికి అవసరమైన స్థలాన్ని కేటాయించాలని ప్రభుత్వాన్ని కోరారు. ఆలయాన్ని పునర్నిర్మించేందుకు టీజీఐఐసీ అధికారులు కూడా స్పందించి చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేశారు.

వినతిపత్రంపై తహసీల్దార్‌ అయ్యప్ప సానుకూలంగా స్పందిస్తూ.. విషయాన్ని రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌ దృష్టికి తీసుకెళ్లి వినతిపత్రాన్ని పంపిస్తామని తెలిపారు.

కార్యక్రమంలో పలెచెల్కతండా, మేడిపల్లి గ్రామాలకు చెందిన పలువురు గ్రామస్తులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install CG News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!