పెరుమాండ్ల ఆంజనేయస్వామి ఆలయానికి 5 గుంటల భూమి కేటాయించాలి

యాచారం, అక్టోబర్‌ 5 (చైతన్యగళం): యాచారం మండలం మేడిపల్లిలోని అతి పురాతన పెరుమాండ్ల ఆంజనేయస్వామి ఆలయానికి ఐదు గుంటల భూమిని కేటాయించాలని కోరుతూ నక్కర్త–మేడిపల్లి పీఆర్‌జీ ఫౌండేషన్‌ అధ్యక్షుడు ప్రొద్దుటూరి రవీందర్‌ గుప్త, పలెచెల్కతండా మాజీ సర్పంచ్‌ లోక్య నాయక్, యాచారం మండల విశ్వహిందూ పరిషత్‌ అధ్యక్షుడు నాళ్ల మురళీకృష్ణ, పలెచెల్కతండాకు చెందిన బావోజీ నారాయణ నాయక్‌ సోమవారం తహసీల్దార్‌ అయ్యప్పకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. చారిత్రక ప్రాధాన్యమున్న పెరుమాండ్ల ఆంజనేయస్వామి ఆలయ అభివృద్ధికి అవసరమైన స్థలాన్ని కేటాయించాలని ప్రభుత్వాన్ని...