కరీంనగర్, అక్టోబర్ 1 (చైతన్యగళం):
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వుల ప్రకారం కరీంనగర్ నగరపాలక సంస్థలోని కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులు, కార్మికులకు గత మూడు నెలలుగా క్రమం తప్పకుండా వేతనాలను బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తున్నట్లు కమిషనర్ ప్రఫుల్ దేశాయ్ తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా ఔట్‌సోర్సింగ్ ఉద్యోగ సిబ్బంది, కార్మికుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రతి నెల 1వ తేదీన వేతనాలు చెల్లిస్తూ భరోసా కల్పిస్తున్నట్లు పేర్కొన్నారు.
ప్రభుత్వ మార్గదర్శకాలను అనుసరిస్తూ ప్రభుత్వ ఉద్యోగులతో పాటు ఒప్పంద ఉద్యోగులకు కూడా ఒకటో తేదీన వేతనాలు అందేలా నగరపాలక సంస్థ యంత్రాంగం తగిన చర్యలు తీసుకుంటుందని కమిషనర్ తెలిపారు. దీంతో నగరపాలక సంస్థ కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులు, కార్మికులు హర్షం వ్యక్తం చేస్తున్నట్లు పేర్కొన్నారు.
