Wednesday, October 21, 2026
Homeతెలంగాణకరీంనగర్ఎస్‌జీఎఫ్‌ అండర్‌-19 వాలీబాల్‌లో దౌల్తాబాద్‌ విజయం

ఎస్‌జీఎఫ్‌ అండర్‌-19 వాలీబాల్‌లో దౌల్తాబాద్‌ విజయం

📰 Generate e-Paper Clip

  • ఉమ్మడి జిల్లా స్థాయి పోటీల్లో ద్వితీయ స్థానంలో సిద్దిపేట జట్టు

కోహెడ, సెప్టెంబరు 29 (చైతన్యగళం): ప్రభుత్వ జూనియర్‌ కళాశాల, కోహెడలో నిర్వహించిన ఉమ్మడి జిల్లా స్థాయి ఎస్‌జీఎఫ్‌ అండర్‌-19 వాలీబాల్‌ పోటీల్లో దౌల్తాబాద్‌ జట్టు విజేతగా నిలిచింది. సిద్దిపేట ప్రభుత్వ జూనియర్‌ కళాశాల జట్టు ద్వితీయ స్థానాన్ని సాధించింది.

పోటీల్లో మొత్తం 24 జట్లు పాల్గొని ప్రతిభ కనబరిచాయి. హోరాహోరీగా సాగిన పోటీల్లో దౌల్తాబాద్‌ జట్టు విజయం సాధించింది. విజేత జట్టుకు జిల్లా ఇంటర్మీడియట్‌ విద్యాధికారి, ఎస్‌జీఎఫ్‌ అండర్‌-19 జిల్లా కన్వీనర్‌ కలకొండ రవీందర్‌రెడ్డి బహుమతులు అందజేసి అభినందించారు.

కార్యక్రమంలో ఎస్‌జీఎఫ్‌ ఆర్గనైజింగ్‌ సెక్రటరీ ఎం. సమ్మయ్య, కళాశాల అధ్యాపకులు కోతి యాదగిరి, వడ్డెపల్లి రాజమౌళి, రాజేశ్వర్‌రెడ్డి, కె. అశోక్‌, వి. నరేష్‌, ఎ. సితారామయ్య, వి. వెంకట్‌రెడ్డి, యస్‌. శ్రీనివాస్‌, కె. రజిత, ఎం. నిరజ, యు. శ్రీనివాస్‌, సుజాత, చిరంజీవి, వివిధ కళాశాలల పీడీలు, క్రీడాకారులు, విద్యార్థులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install CG News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!