ఎస్‌జీఎఫ్‌ అండర్‌-19 వాలీబాల్‌లో దౌల్తాబాద్‌ విజయం

ఉమ్మడి జిల్లా స్థాయి పోటీల్లో ద్వితీయ స్థానంలో సిద్దిపేట జట్టు కోహెడ, సెప్టెంబరు 29 (చైతన్యగళం): ప్రభుత్వ జూనియర్‌ కళాశాల, కోహెడలో నిర్వహించిన ఉమ్మడి జిల్లా స్థాయి ఎస్‌జీఎఫ్‌ అండర్‌-19 వాలీబాల్‌ పోటీల్లో దౌల్తాబాద్‌ జట్టు విజేతగా నిలిచింది. సిద్దిపేట ప్రభుత్వ జూనియర్‌ కళాశాల జట్టు ద్వితీయ స్థానాన్ని సాధించింది. పోటీల్లో మొత్తం 24 జట్లు పాల్గొని ప్రతిభ కనబరిచాయి. హోరాహోరీగా సాగిన పోటీల్లో దౌల్తాబాద్‌ జట్టు విజయం సాధించింది. విజేత జట్టుకు జిల్లా ఇంటర్మీడియట్‌ విద్యాధికారి, ఎస్‌జీఎఫ్‌ అండర్‌-19 జిల్లా కన్వీనర్‌ కలకొండ...