హుజురాబాద్, సెప్టెంబరు 27 (చైతన్యగళం): అనారోగ్యంతో చికిత్స పొందుతూ ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న నిరుపేద కుటుంబాలకు ముఖ్యమంత్రి సహాయనిధి (సీఎంఆర్ఎఫ్) ఆర్థిక భరోసా కల్పిస్తోందని హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి అన్నారు. పట్టణంలోని పలు వార్డుల్లో సీఎంఆర్ఎఫ్ ద్వారా మంజూరైన రూ.4.35 లక్షల విలువైన చెక్కులను లబ్ధిదారులకు ఆయన పంపిణీ చేశారు.

వైద్య ఖర్చులు పేద, మధ్యతరగతి కుటుంబాలపై భారంగా మారుతున్న నేపథ్యంలో సీఎంఆర్ఎఫ్ ద్వారా అందుతున్న ఆర్థిక సహాయం ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని ఎమ్మెల్యే తెలిపారు. అర్హులైన ప్రతి ఒక్కరూ ప్రభుత్వ సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
చెక్కులు అందుకున్న లబ్ధిదారులు ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ బండ శ్రీనివాస్, కౌన్సిలర్లు గందె శ్రీనివాస్, నరేష్, నర్సారెడ్డి లావణ్య, మాజీ కౌన్సిలర్లు కోలిపాక శ్రీనివాస్, ఇమ్రాన్, రమేష్, శాంతన్రెడ్డి, పూర్ణచందర్, శ్రీనివాస్, ముత్యం రాజు, తిరుమల్‌రెడ్డి, రమాదేవి తదితరులు పాల్గొన్నారు.
