సీఎంఆర్‌ఎఫ్ చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే పాడి కౌశిక్
హుజురాబాద్, సెప్టెంబరు 27 (చైతన్యగళం): అనారోగ్యంతో చికిత్స పొందుతూ ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న నిరుపేద కుటుంబాలకు ముఖ్యమంత్రి సహాయనిధి (సీఎంఆర్‌ఎఫ్) ఆర్థిక భరోసా కల్పిస్తోందని హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి అన్నారు. పట్టణంలోని పలు వార్డుల్లో సీఎంఆర్‌ఎఫ్ ద్వారా మంజూరైన రూ.4.35 లక్షల విలువైన చెక్కులను లబ్ధిదారులకు ఆయన పంపిణీ చేశారు. వైద్య ఖర్చులు పేద, మధ్యతరగతి కుటుంబాలపై భారంగా మారుతున్న నేపథ్యంలో సీఎంఆర్‌ఎఫ్ ద్వారా అందుతున్న ఆర్థిక సహాయం ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని ఎమ్మెల్యే తెలిపారు. అర్హులైన ప్రతి ఒక్కరూ ప్రభుత్వ సంక్షేమ...