మర్రిగూడ, సెప్టెంబరు 28 (చైతన్యగళం): మండలంలోని రాంరెడ్డిపల్లిలో సర్పంచ్ లపంగి నరసింహ ఆధ్వర్యంలో సోమవారం గ్రామసభ నిర్వహించారు. జాతీయ ఉపాధి హామీ పథకం పేరు మార్పుపై గ్రామస్థులతో చర్చించారు.
గ్రామంలో నీటి భద్రత, మౌలిక వసతులు, జీవనోపాధి, విపత్తు నిర్వహణతో పాటు పలు అభివృద్ధి పనులు చేపట్టాలని సర్పంచ్ అధికారులను కోరారు. కార్యక్రమంలో ఉపసర్పంచ్ పొగాకు సైదులు, పంచాయతీ కార్యదర్శి నజీరా, ఏపీవో జయరాజ్, ఏఈవో సుజాత, ఫీల్డ్ అసిస్టెంట్ యాదయ్య, మాజీ సర్పంచ్ మల్లయ్య, గ్రామశాఖ అధ్యక్షుడు కారింగు నరసింహ, పాలకవర్గ సభ్యులు, గ్రామస్థులు పాల్గొన్నారు.
