Sunday, September 27, 2026
Homeతెలంగాణసాయిబాబా గుడి రోడ్డు డ్రైనేజీ నిర్మాణానికి మోక్షమెప్పుడో?

సాయిబాబా గుడి రోడ్డు డ్రైనేజీ నిర్మాణానికి మోక్షమెప్పుడో?

📰 Generate e-Paper Clip

  • నాలుగేళ్లుగా సమస్యను పట్టించుకోని పాలకులు.. తక్షణమే పనులు పూర్తి చేయాలని సీపీఐ డిమాండ్‌

మహబూబాబాద్‌, సెప్టెంబరు 26 (చైతన్యగళం): సాయిబాబా గుడి రోడ్డులో నిలిచిపోయిన డ్రైనేజీ, రహదారి నిర్మాణ పనులను తక్షణమే పూర్తి చేయాలని డిమాండ్‌ చేస్తూ సీపీఐ ఆధ్వర్యంలో స్థానికులు శనివారం నిరసన చేపట్టారు. సీపీఐ 33వ వార్డు కమిటీ ఆధ్వర్యంలో జరిగిన ఆందోళనకు 33వ వార్డు కౌన్సిలర్‌, సీపీఐ మున్సిపల్‌ ఫ్లోర్‌ లీడర్‌ బి. అజయ్‌ సారధిరెడ్డి నాయకత్వం వహించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నాలుగేళ్లుగా డ్రైనేజీ నిర్మాణం పూర్తికాకపోవడంతో మురుగునీరు రోడ్డుపై నిలిచిపోయి స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. ఇళ్ల యజమానులు, వ్యాపారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, కొందరు ఇతర ప్రాంతాలకు వెళ్లి అద్దె ఇళ్లలో ఉంటున్నారని పేర్కొన్నారు. సాయిబాబా ఆలయానికి వచ్చే భక్తులతో పాటు పత్తిపాక వైపు నుంచి జిల్లా కేంద్రానికి రాకపోకలు సాగించే వాహనదారులు, ప్రయాణికులు, పాదచారులు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు.

రోడ్డుపై మురుగునీరు, చెత్తాచెదారం పేరుకుపోవడంతో ప్రమాదాలు జరుగుతున్నా అధికారులు, ప్రజాప్రతినిధులు పట్టించుకోవడం లేదని అజయ్‌ సారధిరెడ్డి ఆరోపించారు. నూతన మున్సిపల్‌ పాలకవర్గం ఏర్పడిన నేపథ్యంలోనైనా సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని, నిలిచిపోయిన రహదారి, డ్రైనేజీ పనులను తక్షణమే చేపట్టి పూర్తి చేయాలని డిమాండ్‌ చేశారు.

నిరసనలో స్థానికులు మిత్తింటి ఉపేందర్‌ యాదవ్‌, ధనుంజయ్‌, సీపీఐ నాయకులు నర్రా శ్రావణ్‌, కట్లోజు పాండురంగాచారి, కేదాస రమేష్‌, భానోత్‌ లింగయ్య నాయక్‌, పడిదల కవిత, నీలం వెంకటేశ్వర్లు, గాదం శ్యాంప్రసాద్‌, యూసుఫ్‌, మంద శంకర్‌, తండా శ్రీనాథ్‌, వెంకట్రాం, నర్సయ్య, గుండోజు రమేష్‌ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install CG News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!