సాయిబాబా గుడి రోడ్డు డ్రైనేజీ నిర్మాణానికి మోక్షమెప్పుడో?

నాలుగేళ్లుగా సమస్యను పట్టించుకోని పాలకులు.. తక్షణమే పనులు పూర్తి చేయాలని సీపీఐ డిమాండ్‌ మహబూబాబాద్‌, సెప్టెంబరు 26 (చైతన్యగళం): సాయిబాబా గుడి రోడ్డులో నిలిచిపోయిన డ్రైనేజీ, రహదారి నిర్మాణ పనులను తక్షణమే పూర్తి చేయాలని డిమాండ్‌ చేస్తూ సీపీఐ ఆధ్వర్యంలో స్థానికులు శనివారం నిరసన చేపట్టారు. సీపీఐ 33వ వార్డు కమిటీ ఆధ్వర్యంలో జరిగిన ఆందోళనకు 33వ వార్డు కౌన్సిలర్‌, సీపీఐ మున్సిపల్‌ ఫ్లోర్‌ లీడర్‌ బి. అజయ్‌ సారధిరెడ్డి నాయకత్వం వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నాలుగేళ్లుగా డ్రైనేజీ నిర్మాణం పూర్తికాకపోవడంతో...