Sunday, September 27, 2026
Homeతెలంగాణరాష్ట్రస్థాయి కబడ్డీ పోటీలకు సిద్దిపేట జిల్లా జట్టు

రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీలకు సిద్దిపేట జిల్లా జట్టు

📰 Generate e-Paper Clip

  • క్రీడాకారులకు కేడం లింగమూర్తి అభినందనలు

హుస్నాబాద్‌, సెప్టెంబరు 26 (చైతన్యగళం): రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీలకు ఎంపికైన సిద్దిపేట జిల్లా జట్టు సభ్యులను జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్‌ కేడం లింగమూర్తి అభినందించారు. శనివారం హుస్నాబాద్‌ మార్కెట్‌యార్డులోని కబడ్డీ శిక్షణ కేంద్రాన్ని సందర్శించి క్రీడాకారులతో మాట్లాడారు. రాష్ట్రస్థాయి పోటీల్లో ప్రతిభ కనబరిచి జాతీయస్థాయికి ఎంపిక కావాలని ఆకాంక్షించారు.

మంత్రి పొన్నం ప్రభాకర్‌ సూచనల మేరకు క్రీడాకారులకు అవసరమైన శిక్షణ, ప్రోత్సాహం అందించేందుకు కృషి చేస్తున్నామని లింగమూర్తి తెలిపారు. చదువుతో పాటు క్రీడలపై ఆసక్తి పెంచుకోవాలని సూచించారు. క్రీడలతో శారీరక ఆరోగ్యంతో పాటు క్రమశిక్షణ, సమయపాలన, జట్టు స్ఫూర్తి, ఆత్మవిశ్వాసం పెంపొందుతాయని పేర్కొన్నారు.

రాష్ట్రస్థాయి పోటీలకు వెళ్లే క్రీడాకారులకు హుస్నాబాద్‌ ప్రభుత్వ ఆసుపత్రిలో ఆరోగ్య పరీక్షలు నిర్వహించారు. సూపరింటెండెంట్‌ డాక్టర్‌ కె. రమేష్‌రెడ్డి ఆధ్వర్యంలో పరీక్షలు నిర్వహించి, అవసరమైన వైద్య సహకారం అందిస్తామని తెలిపారు. కార్యక్రమంలో కబడ్డీ కోచ్‌లు కృష్ణ, గద్దల రమేష్‌, నాయకులు మహేందర్‌ తదితరులు పాల్గొన్నారు.

 

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install CG News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!