రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీలకు సిద్దిపేట జిల్లా జట్టు

క్రీడాకారులకు కేడం లింగమూర్తి అభినందనలు హుస్నాబాద్‌, సెప్టెంబరు 26 (చైతన్యగళం): రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీలకు ఎంపికైన సిద్దిపేట జిల్లా జట్టు సభ్యులను జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్‌ కేడం లింగమూర్తి అభినందించారు. శనివారం హుస్నాబాద్‌ మార్కెట్‌యార్డులోని కబడ్డీ శిక్షణ కేంద్రాన్ని సందర్శించి క్రీడాకారులతో మాట్లాడారు. రాష్ట్రస్థాయి పోటీల్లో ప్రతిభ కనబరిచి జాతీయస్థాయికి ఎంపిక కావాలని ఆకాంక్షించారు. మంత్రి పొన్నం ప్రభాకర్‌ సూచనల మేరకు క్రీడాకారులకు అవసరమైన శిక్షణ, ప్రోత్సాహం అందించేందుకు కృషి చేస్తున్నామని లింగమూర్తి తెలిపారు. చదువుతో పాటు క్రీడలపై ఆసక్తి పెంచుకోవాలని...