-
కుటుంబానికి అండగా ఉంటానని రాజునాయక్ భరోసా
యాచారం, సెప్టెంబరు 24 (చైతన్యగళం): నందివనపర్తి గ్రామానికి చెందిన జాల జంగయ్య యాదవ్ అనారోగ్యంతో మృతి చెందారు. విషయం తెలుసుకున్న నందివనపర్తి మాజీ సర్పంచ్ డా.రాజునాయక్ గురువారం జంగయ్య కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు.
ఈ సందర్భంగా రాజునాయక్ మాట్లాడుతూ.. జంగయ్య కుటుంబానికి ఎల్లవేళలా అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. పరామర్శించిన వారిలో గ్రామ ఉపసర్పంచ్ జెనిగే శ్రీశైలం, 5వ వార్డు సభ్యుడు యంజాల విజేత చంద్రకాంత్, 6వ వార్డు సభ్యుడు నిట్టి బీరప్ప, సీనియర్ నాయకుడు ముచర్ల జంగయ్య తదితరులు పాల్గొన్నారు.
