Monday, September 21, 2026
Homeతెలంగాణడిగ్రీ కళాశాలలో న్యాయ విజ్ఞాన సదస్సు

డిగ్రీ కళాశాలలో న్యాయ విజ్ఞాన సదస్సు

📰 Generate e-Paper Clip

డ్రగ్స్‌కు దూరంగా ఉండాలి: న్యాయమూర్తులు

హుస్నాబాద్‌, సెప్టెంబర్‌ 21 (చైతన్యగళం): మండల న్యాయ సేవాధికార సంస్థ, జూనియర్‌ సివిల్‌ జడ్జి కోర్టు హుస్నాబాద్‌ ఆధ్వర్యంలో స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో సోమవారం న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు. ముఖ్య అతిథిగా జిల్లా న్యాయ సేవాధికార సంస్థ సిద్దిపేట కార్యదర్శి, న్యాయమూర్తి కె.సౌజన్య హాజరై విద్యార్థులకు మాదకద్రవ్యాల నిరోధక చట్టం–1985పై అవగాహన కల్పించారు.

మాదకద్రవ్యాల వినియోగం, కలిగి ఉండటం, విక్రయించడం, అక్రమ కార్యకలాపాలకు పాల్పడటం వంటి నేరాలకు చట్టప్రకారం కఠిన శిక్షలు ఉంటాయని తెలిపారు. విద్యార్థులు మాదకద్రవ్యాలకు దూరంగా ఉండి భవిష్యత్తును తీర్చిదిద్దుకోవాలని సూచించారు.

అదనపు జూనియర్‌ సివిల్‌ జడ్జి ప్రమిద మాట్లాడుతూ.. విద్యార్థులే దేశ భవిష్యత్తుకు పునాది అని, చెడు వ్యసనాలకు దూరంగా ఉండి ఉన్నత లక్ష్యాలను సాధించాలని సూచించారు. కళాశాల ప్రిన్సిపాల్‌ ప్రొఫెసర్‌ విజయగిరి బిక్షపతి ఆధ్వర్యంలో విద్యార్థులతో మాదకద్రవ్యాలకు దూరంగా ఉంటామని ప్రతిజ్ఞ చేయించారు. కార్యక్రమంలో కళాశాల యాంటీ డ్రగ్‌ కమిటీ ఇన్‌చార్జి డాక్టర్‌ పి.బాలరాజు, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install CG News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!