డిగ్రీ కళాశాలలో న్యాయ విజ్ఞాన సదస్సు

డ్రగ్స్‌కు దూరంగా ఉండాలి: న్యాయమూర్తులు హుస్నాబాద్‌, సెప్టెంబర్‌ 21 (చైతన్యగళం): మండల న్యాయ సేవాధికార సంస్థ, జూనియర్‌ సివిల్‌ జడ్జి కోర్టు హుస్నాబాద్‌ ఆధ్వర్యంలో స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో సోమవారం న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు. ముఖ్య అతిథిగా జిల్లా న్యాయ సేవాధికార సంస్థ సిద్దిపేట కార్యదర్శి, న్యాయమూర్తి కె.సౌజన్య హాజరై విద్యార్థులకు మాదకద్రవ్యాల నిరోధక చట్టం–1985పై అవగాహన కల్పించారు. మాదకద్రవ్యాల వినియోగం, కలిగి ఉండటం, విక్రయించడం, అక్రమ కార్యకలాపాలకు పాల్పడటం వంటి నేరాలకు చట్టప్రకారం కఠిన శిక్షలు ఉంటాయని తెలిపారు. విద్యార్థులు...