మంచాల, సెప్టెంబర్ 21 (చైతన్యగళం): అనారోగ్యంతో వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందిన పేదలకు మంజూరైన సీఎం సహాయనిధి చెక్కులను కాంగ్రెస్ రాష్ట్ర నాయకుడు కొంగర విష్ణువర్ధన్‌రెడ్డి సోమవారం మంచాల మండలం ఆరుట్లలో లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి పంపిణీ చేశారు. ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి సహకారంతో మంజూరైన చెక్కులను గ్రామ కాంగ్రెస్ అధ్యక్ష, కార్యదర్శులు నూకం బాలరాజు, చిందం శ్రీశైలం ఆధ్వర్యంలో అందజేశారు.
ఈ సందర్భంగా విష్ణువర్ధన్‌రెడ్డి మాట్లాడుతూ.. పేద ప్రజల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమన్నారు. వైద్య ఖర్చులు భరించలేని పేదలకు సీఎం సహాయనిధి ద్వారా ఆర్థిక చేయూత అందుతోందని తెలిపారు. నియోజకవర్గంలో ఇప్పటికే పలువురు పేదలకు వైద్య చికిత్స కోసం సీఎం సహాయనిధి చెక్కులు అందించినట్లు పేర్కొన్నారు. అర్హులైన పేదలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
కార్యక్రమంలో ఇబ్రహీంపట్నం మార్కెట్ కమిటీ డైరెక్టర్ సాతిరి ఎల్లేష్, వార్డు సభ్యులు అనంగల్ల జగన్నాథం, ఎండీ ఇమ్రాన్, కాంగ్రెస్ నాయకులు గుడిమల్ల చంద్రయ్య, మార సురేష్, అంతటి రాజుగౌడ్, దాసరమోని రమేష్, మానిపాటి వెంకటేష్, సుంకరి ప్రవీణ్, ఇందిరమ్మ కమిటీ సభ్యులు చెరుకు నర్సింహ, బుట్టి కృష్ణ, మార లక్ష్మణ్, ఆరుట్ల యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు బుడిగల పరమేష్, నియోజకవర్గ యువజన కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి రావుల నాగరాజు తదితరులు పాల్గొన్నారు.
