పేదలు సీఎం సహాయనిధిని సద్వినియోగం చేసుకోవాలి: కొంగర విష్ణువర్ధన్‌రెడ్డి

మంచాల, సెప్టెంబర్‌ 21 (చైతన్యగళం): అనారోగ్యంతో వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందిన పేదలకు మంజూరైన సీఎం సహాయనిధి చెక్కులను కాంగ్రెస్‌ రాష్ట్ర నాయకుడు కొంగర విష్ణువర్ధన్‌రెడ్డి సోమవారం మంచాల మండలం ఆరుట్లలో లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి పంపిణీ చేశారు. ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి సహకారంతో మంజూరైన చెక్కులను గ్రామ కాంగ్రెస్‌ అధ్యక్ష, కార్యదర్శులు నూకం బాలరాజు, చిందం శ్రీశైలం ఆధ్వర్యంలో అందజేశారు. ఈ సందర్భంగా విష్ణువర్ధన్‌రెడ్డి మాట్లాడుతూ.. పేద ప్రజల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమన్నారు. వైద్య ఖర్చులు భరించలేని పేదలకు సీఎం సహాయనిధి...