Thursday, October 15, 2026
Homeతెలంగాణకరీంనగర్ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాన్ని వేగవంతం చేయాలి - కలెక్టర్ చిత్రా మిశ్రా

ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాన్ని వేగవంతం చేయాలి – కలెక్టర్ చిత్రా మిశ్రా

📰 Generate e-Paper Clip

కరీంనగర్, సెప్టెంబర్ 19 (చైతన్యగళం)

అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల ప్రయోజనాలు అర్హులైన ప్రతి ఒక్కరికీ చేరేలా అధికారులు బాధ్యతాయుతంగా పనిచేయాలని జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా ఆదేశించారు. శనివారం కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో గ్రామీణ అభివృద్ధి సంస్థ అధికారులు, ఎంపీడీవోలతో వివిధ కార్యక్రమాలపై సమీక్ష నిర్వహించారు.

ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులను యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలని, ప్రారంభం కాని ఇళ్లతో పాటు వివిధ దశల్లో ఉన్న నిర్మాణాలను వేగవంతం చేయాలని ఆదేశించారు. లబ్ధిదారులతో సమన్వయం చేసుకుంటూ పనులు త్వరగా పూర్తయ్యేలా ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. రెండో విడత ఇందిరమ్మ ఇళ్ల పనులను కూడా సత్వరమే చేపట్టేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

వృద్ధులు, ఒంటరి మహిళలు, దివ్యాంగులు, ఇతర అర్హులైన వారెవరూ చేయూత పింఛన్లకు దూరం కాకుండా క్షేత్రస్థాయిలో పరిశీలించి అర్హులను గుర్తించాలని సూచించారు. గ్రామాల్లో సీసీ రోడ్లు, ఈజీఎస్ పనులు, నీటి కుంటలు, ఇంకుడు గుంతలు, ఫామ్‌పాండ్ల నిర్మాణాలను నిర్దేశిత లక్ష్యాల మేరకు పూర్తి చేయాలని, వీఓ భవనాల నిర్మాణ పనులను వెంటనే ప్రారంభించాలని ఆదేశించారు.

ప్రజాపాలన, ప్రజావాణి ద్వారా వచ్చిన దరఖాస్తులను నిర్ణీత సమయంలో పరిష్కరించాలని, ప్రజల సమస్యలు, అభ్యర్థనలను ప్రాధాన్యతతో పరిశీలించి పరిష్కారం చూపాలని కలెక్టర్ సూచించారు. ప్రభుత్వ పథకాల అమలులో క్షేత్రస్థాయి అధికారుల పనితీరు కీలకమని, ప్రతి కార్యక్రమంలో స్పష్టమైన పురోగతి కనిపించేలా చర్యలు చేపట్టాలని ఆదేశించారు.సమీక్ష సమావేశంలో అదనపు కలెక్టర్ అశ్విని తానాజీ వాకడే, డీఆర్‌డీవో గీత, ఎంపీడీవోలు, గ్రామీణ అభివృద్ధి సంస్థ అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

 

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install CG News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!