కరీంనగర్, సెప్టెంబర్ 19 (చైతన్యగళం):
నగరంలోని 57వ డివిజన్ గణేష్‌నగర్‌లో గణేష్ సేవా యూత్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న 23వ గణేష్ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా శనివారం సిద్ధి బుద్ధి సమేత శ్రీ విఘ్నేశ్వరస్వామి కల్యాణ మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. భక్తులు పెద్ద సంఖ్యలో సంప్రదాయ దుస్తుల్లో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు.
కల్యాణం అనంతరం చిన్నారులు భరతనాట్యం, కూచిపూడి, కథాకళి తదితర నృత్య ప్రదర్శనలు నిర్వహించారు. భారతీయ కళలు, సంస్కృతిని ప్రతిబింబించేలా చిన్నారులు ప్రదర్శించిన కళారూపాలు కాలనీవాసులను ఆకట్టుకున్నాయి. అనంతరం భక్తులకు మ్యాన రోజా శ్రీనివాస్ ఆధ్వర్యంలో అల్పాహారం ఏర్పాటు చేశారు.
