ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాన్ని వేగవంతం చేయాలి – కలెక్టర్ చిత్రా మిశ్రా

కరీంనగర్, సెప్టెంబర్ 19 (చైతన్యగళం) అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల ప్రయోజనాలు అర్హులైన ప్రతి ఒక్కరికీ చేరేలా అధికారులు బాధ్యతాయుతంగా పనిచేయాలని జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా ఆదేశించారు. శనివారం కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో గ్రామీణ అభివృద్ధి సంస్థ అధికారులు, ఎంపీడీవోలతో వివిధ కార్యక్రమాలపై సమీక్ష నిర్వహించారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులను యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలని, ప్రారంభం కాని ఇళ్లతో పాటు వివిధ దశల్లో ఉన్న నిర్మాణాలను వేగవంతం చేయాలని ఆదేశించారు. లబ్ధిదారులతో సమన్వయం చేసుకుంటూ పనులు త్వరగా పూర్తయ్యేలా ప్రత్యేక దృష్టి సారించాలని...