కరీంనగర్, సెప్టెంబర్ 9(చైతన్యగళం):
ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియను వేగవంతం చేయాలని ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. సోమవారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో నోటీసుల పరిష్కారం, తుది ఓటర్ల జాబితా రూపకల్పనపై సమీక్షించారు కరీంనగర్ నగరపాలక సంస్థ కార్యాలయం నుంచి ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ అధికారి, మున్సిపల్ కమిషనర్ ప్రఫుల్ దేశాయ్ పాల్గొన్నారు. పొడిగించిన గడువులోగా నోటీసుల పరిష్కారాన్ని పూర్తి చేయాలని, అర్హులైన ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు కల్పించేలా జాబితాలో తప్పులను సరిదిద్దాలని సీఈఓ సూచించారు. కరీంనగర్ పరిధిలో ప్రక్రియను వేగవంతం చేసి, నిర్ణీత గడువులోగా పూర్తి చేస్తామని ప్రఫుల్ దేశాయ్ తెలిపారు. కార్యక్రమంలో ఏఈఆర్ఓ రాజేష్ తదితరులు పాల్గొన్నారు.
