నందికొట్కూరు, జూలై 26 (చైతన్యగళం):
అఖిల భారత ప్రగతిశీల మహిళా సంఘం (ఏఐపిడబ్ల్యూఏ) ఆధ్వర్యంలో నంద్యాల జిల్లా జనరల్ బాడీ సమావేశం ఆదివారం నందికొట్కూరు పట్టణంలో జరిగింది. జిల్లా నాయకురాలు షేక్ బీబీ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర కార్యదర్శి ఆర్. నాగమణి, ఉమ్మడి కర్నూలు జిల్లా కార్యదర్శి పిక్కిలి వెంకటేశ్వర్లు, ప్రముఖ సామాజిక కార్యకర్త గుజ్జుల గౌరీశ్వర నాయుడు హాజరయ్యారు.వారు మాట్లాడుతూ, “మహిళలపై జరుగుతున్న అన్యాయాలు, అణచివేతలు, హింసాత్మక ఘటనలను అరికట్టేందుకు ఏఐపిడబ్ల్యూఏ మహిళలకు భూమి హక్కులు, సమాన పనికి సమాన వేతనం, సామాజిక న్యాయం, ఆర్థిక స్వావలంబనే ప్రధాన లక్ష్యంగా ఉద్యమిస్తోంది” అని పేర్కొన్నారు. గ్రామస్థాయి నుండి రాష్ట్రస్థాయి వరకు మహిళలను సంఘటితం చేసి హక్కుల సాధన కోసం పోరాటాలను మరింత విస్తృతం చేయాలని పిలుపునిచ్చారు.సమావేశంలో నంద్యాల జిల్లా నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. జిల్లా అధ్యక్షురాలు, ఉపాధ్యక్షురాలు, కార్యదర్శితో పాటు 10 మంది సభ్యులతో కొత్త కమిటీని ఏర్పాటు చేశారు. మహిళా హక్కుల పరిరక్షణ, సామాజిక సమానత్వం, మహిళలపై హింస నిరోధం, ఉపాధి అవకాశాల విస్తరణ, ప్రభుత్వ సంక్షేమ పథకాల సమర్థ అమలుకు కొత్త కమిటీ మరింత బలోపేతం చేయాలని నిర్ణయించారు.ఈ కార్యక్రమంలో సిపిఐ(ఎంఎల్) లిబరేషన్ పార్టీ నందికొట్కూరు మండల కార్యదర్శి కాటేపోగు సోమన్న, వడ్డే శ్రీరాములు, ఎస్. సలీం, భాష మహబూబ్ బాషా, మహిళా నాయకులు ఎం. శిరీష, తహరాభి, వై. నాగమణి, ఎస్. ముత్తు, జాబి సుబ్బమ్మ, సుజాత, వడ్డే మల్లమ్మ తదితరులు పాల్గొన్నారు.
మహిళా హక్కుల సాధనే లక్ష్యంగా సిపిఐ ఎంఎల్ ఉద్యమాలు
RELATED ARTICLES
