మహిళా హక్కుల సాధనే లక్ష్యంగా సిపిఐ ఎంఎల్ ఉద్యమాలు

నందికొట్కూరు, జూలై 26 (చైతన్యగళం): అఖిల భారత ప్రగతిశీల మహిళా సంఘం (ఏఐపిడబ్ల్యూఏ) ఆధ్వర్యంలో నంద్యాల జిల్లా జనరల్ బాడీ సమావేశం ఆదివారం నందికొట్కూరు పట్టణంలో జరిగింది. జిల్లా నాయకురాలు షేక్ బీబీ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర కార్యదర్శి ఆర్. నాగమణి, ఉమ్మడి కర్నూలు జిల్లా కార్యదర్శి పిక్కిలి వెంకటేశ్వర్లు, ప్రముఖ సామాజిక కార్యకర్త గుజ్జుల గౌరీశ్వర నాయుడు హాజరయ్యారు.వారు మాట్లాడుతూ, “మహిళలపై జరుగుతున్న అన్యాయాలు, అణచివేతలు, హింసాత్మక ఘటనలను అరికట్టేందుకు ఏఐపిడబ్ల్యూఏ మహిళలకు భూమి హక్కులు, సమాన పనికి...