Wednesday, November 25, 2026
Homeతెలంగాణఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న మైనార్టీ కుటుంబానికి ఉప్పల వెంకటేష్‌ అండ

ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న మైనార్టీ కుటుంబానికి ఉప్పల వెంకటేష్‌ అండ

📰 Generate e-Paper Clip

  • అసంపూర్తిగా నిలిచిపోయిన ఇంటి నిర్మాణం పూర్తి చేసేందుకు సిమెంట్‌ అందజేత

కల్వకుర్తి, నవంబర్‌ 23 (చైతన్యగళం):

మానవత్వమే మిన్నగా భావిస్తూ ఆపదలో ఉన్న పేద కుటుంబాలకు అండగా నిలుస్తున్న ఉప్పల చారిటబుల్‌ ట్రస్ట్‌ చైర్మన్‌, బీఆర్‌ఎస్‌ నాయకుడు, రాష్ట్ర మిషన్‌ భగీరథ మాజీ వైస్‌ చైర్మన్‌ ఉప్పల వెంకటేష్‌ మరోసారి తన సేవా గుణాన్ని చాటుకున్నారు. ఆర్థిక ఇబ్బందులతో ఇంటి నిర్మాణాన్ని మధ్యలోనే నిలిపివేసిన ఓ మైనార్టీ కుటుంబానికి అవసరమైన సిమెంట్‌ అందజేసి ఆదుకున్నారు.

కల్వకుర్తి మున్సిపాలిటీ పరిధిలోని 14వ వార్డు గాంధీనగర్‌ కాలనీకి చెందిన మహ్మద్‌ జంగీర్‌ కుటుంబం ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఇంటి నిర్మాణాన్ని పూర్తి చేసుకోలేకపోయింది. ఈ విషయాన్ని 14వ వార్డు కౌన్సిలర్‌ బావాండ్ల మంజుల, బీఆర్‌ఎస్‌ పార్టీ పట్టణ అధ్యక్షుడు బావాండ్ల మధు ఉప్పల వెంకటేష్‌ దృష్టికి తీసుకెళ్లారు.

దీంతో వెంటనే స్పందించిన ఉప్పల వెంకటేష్‌ ఇంటి నిర్మాణం పూర్తి చేసుకునేందుకు అవసరమైన సిమెంట్‌ను మహ్మద్‌ జంగీర్‌ కుటుంబానికి అందజేశారు. ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న కుటుంబానికి అండగా నిలవడంపై స్థానికులు హర్షం వ్యక్తం చేశారు.

ఈ కార్యక్రమంలో బీఆర్‌ఎస్‌ పార్టీ పట్టణ అధ్యక్షుడు బావాండ్ల మధు, కల్వకుర్తి మున్సిపల్‌ మాజీ స్పెషల్‌ నాలెడ్జ్‌ పర్సన్‌ కుడుముల మనోహర్‌రెడ్డి, ఆర్యవైశ్య సంఘం నాయకుడు దాచేపల్లి శ్రీనివాసులు, బీఆర్‌ఎస్‌ సీనియర్‌ నాయకుడు భగత్‌సింగ్‌, బీఆర్‌ఎస్వీ రాష్ట్ర నాయకుడు దారమోని గణేష్‌, గంప శ్రీనివాసులు, ఊర్కొండ సర్పంచ్‌ మేకల మంజుల శ్రీనివాసులు, వెంకటాపురం గ్రామ బీఆర్‌ఎస్‌ అధ్యక్షుడు యాదయ్యగౌడ్‌, విష్ణు, కంఠం రవీందర్‌, తుర్కలపల్లి సర్పంచ్‌ అభ్యర్థి శేఖర్‌గౌడ్‌, గాంధీనగర్‌ కాలనీకి చెందిన బ్రహ్మచారి, చోటు, రావుఫ్‌, కృష్ణ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install CG News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!