Wednesday, November 25, 2026
Homeతెలంగాణజన్మదిన వేడుకలను సేవా కార్యక్రమంగా నిర్వహించడం అభినందనీయం

జన్మదిన వేడుకలను సేవా కార్యక్రమంగా నిర్వహించడం అభినందనీయం

📰 Generate e-Paper Clip

  • ఉచిత కంటి వైద్య శిబిరాన్ని అభినందించిన ఫుడ్‌ కమిషన్‌ చైర్మన్‌ గోలి శ్రీనివాస్‌రెడ్డి

మాడుగుల, నవంబర్‌ 23 (చైతన్యగళం):

జన్మదిన వేడుకలను కేవలం వ్యక్తిగత సంబరాలకే పరిమితం చేయకుండా, ప్రజలకు ఉపయోగపడే సేవా కార్యక్రమంగా నిర్వహించడం అభినందనీయమని తెలంగాణ రాష్ట్ర ఫుడ్‌ కమిషన్‌ చైర్మన్‌ గోలి శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. డాక్టర్‌ ఆర్‌.ఎస్‌. ప్రవీణ్‌కుమార్‌ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని మాడుగుల గ్రామంలో కొల్కులపల్లి 11వ వార్డు సభ్యుడు పోలే మహేష్‌ ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించారు. హైదరాబాద్‌లోని లక్డీకాపూల్‌ వాసవి ఐ హాస్పిటల్‌ సహకారంతో ఈ శిబిరాన్ని ఏర్పాటు చేశారు.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన గోలి శ్రీనివాస్‌రెడ్డి, మాజీ కల్వకుర్తి మున్సిపల్‌ చైర్మన్‌ ఎడ్మ సత్యం, బట్టు ధర్మారెడ్డి, గోపిడి నారాయణరెడ్డి, మాజీ సర్పంచ్‌ జంగయ్య, సుధీర్‌గౌడ్‌, మాజీ మార్కెట్‌ డైరెక్టర్‌ సురమళ్ల సుభాష్‌ తదితరులు కేక్‌ కట్‌ చేసి డాక్టర్‌ ఆర్‌.ఎస్‌. ప్రవీణ్‌కుమార్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.

ఈ సందర్భంగా గోలి శ్రీనివాస్‌రెడ్డి మాట్లాడుతూ.. పోలే మహేష్‌ చొరవ తీసుకుని వాసవి ఐ హాస్పిటల్‌ సహకారంతో ఉచిత కంటి వైద్య శిబిరాన్ని నిర్వహించడం ద్వారా ప్రజలకు వైద్య సేవలు అందించే అవకాశం కల్పించారని ప్రశంసించారు. ప్రజల ఆరోగ్య పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యతని, ముఖ్యంగా పేద, మధ్యతరగతి కుటుంబాలకు నాణ్యమైన వైద్య సేవలు అందుబాటులో ఉండటం ఎంతో అవసరమని అన్నారు.

కంటి సమస్యలను నిర్లక్ష్యం చేయకుండా సకాలంలో వైద్య పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. ఇలాంటి ఉచిత వైద్య శిబిరాల ద్వారా గ్రామీణ ప్రాంత ప్రజలకు ఎంతో ప్రయోజనం చేకూరుతుందని తెలిపారు. సమాజానికి ఉపయోగపడే సేవా కార్యక్రమాలు మరింత విస్తరించాలని, ప్రజల ఆరోగ్యం, సంక్షేమం కోసం ప్రతి ఒక్కరూ తమ వంతు సహకారం అందించాలని ఆకాంక్షించారు.

ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు సుధాకర్‌, పడాల శివ, పడాల అనిల్‌, పోలే కృష్ణయ్య, ఆజి తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install CG News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!