Wednesday, November 25, 2026
Homeతెలంగాణకల్వకుర్తి, వెల్దండ అభివృద్ధికి రూ.5.60 కోట్ల నిధులు

కల్వకుర్తి, వెల్దండ అభివృద్ధికి రూ.5.60 కోట్ల నిధులు

📰 Generate e-Paper Clip

  • పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, పూర్తయిన పనుల ప్రారంభోత్సవాలు

కల్వకుర్తి, నవంబర్‌ 23 (చైతన్యగళం): కల్వకుర్తి నియోజకవర్గ అభివృద్ధికి ప్రాధాన్యమిస్తూ ప్రజలకు మెరుగైన మౌలిక సదుపాయాలు కల్పించేందుకు ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోందని ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి అన్నారు. సోమవారం కల్వకుర్తి పట్టణంతో పాటు వెల్దండ మండల పరిధిలో పర్యటించిన ఆయన పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, పూర్తయిన పనులకు ప్రారంభోత్సవాలు నిర్వహించారు. వివిధ కార్యక్రమాల్లో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. కల్వకుర్తి పట్టణంలో నూతనంగా నిర్మించిన అగ్నిమాపక కేంద్రం ప్రారంభంతో అగ్నిప్రమాదాలు సంభవించినప్పుడు ప్రజలకు మరింత వేగంగా సేవలు అందించే అవకాశం కలుగుతుందని తెలిపారు. విద్యానగర్‌, తిలక్‌నగర్‌ ప్రాంతాల్లో నివాస గృహాల మీదుగా వెళ్తున్న 33 కేవీ సిర్సనగండ్ల ఫీడర్‌ను ప్రత్యామ్నాయ మార్గంలోకి మార్చేందుకు పనులు చేపట్టడం ద్వారా స్థానికుల సమస్యకు పరిష్కారం లభిస్తుందని పేర్కొన్నారు.

రైతుల సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని, రైతులు దళారులను ఆశ్రయించకుండా ప్రభుత్వం ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాల్లోనే పంటను విక్రయించి మద్దతు ధర పొందాలని సూచించారు. మెప్మా ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వడ్ల కొనుగోలు కేంద్రంతో పాటు వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించడం సంతోషంగా ఉందన్నారు.

కల్వకుర్తి, వెల్దండ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల నూతన చైర్మన్లుగా శ్రీపురం హరీశ్వర్‌రెడ్డి, ఎన్నం భూపతిరెడ్డి బాధ్యతలు స్వీకరించడంతో పాటు పాలకవర్గ సభ్యులు ప్రమాణ స్వీకారం చేయడం అభినందనీయమని ఎమ్మెల్యే తెలిపారు. రైతులకు అందుబాటులో ఉంటూ సహకార సంఘాల ద్వారా మెరుగైన సేవలు అందించాలని సూచించారు.

వెల్దండ మండలంలోని పలు గ్రామాలు, తండాల్లో పర్యటించి సుమారు రూ.5.60 కోట్ల విలువైన వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేయడంతో పాటు పూర్తయిన పనులను ప్రారంభించినట్లు వెల్లడించారు. ప్రజల అవసరాలను గుర్తించి గ్రామీణ ప్రాంతాల నుంచి పట్టణాల వరకు అన్ని రంగాల్లో అభివృద్ధి కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్తామని, కల్వకుర్తి నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో నడిపించేందుకు నిరంతరం కృషి చేస్తామని కసిరెడ్డి నారాయణరెడ్డి స్పష్టం చేశారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install CG News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!