బావుపేటలో ‘మన గ్రామం – మన పాఠశాల’ కార్యక్రమం ప్రారంభం
ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు నాణ్యమైన అల్పాహారం అందించడమే లక్ష్యం ఎల్కతుర్తి, నవంబర్ 11 (చైతన్యగళం): హనుమకొండ జిల్లా హుస్నాబాద్ నియోజకవర్గం ఎల్కతుర్తి మండలం బావుపేట గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలల్లో ‘మన గ్రామం – మన పాఠశాల’ కార్యక్రమంలో భాగంగా సీఎం బ్రేక్ఫాస్ట్ పథకాన్ని ఘనంగా ప్రారంభించారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు నాణ్యమైన అల్పాహారం అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని ప్రవేశపెట్టింది. ఇందులో భాగంగా ప్రతిరోజూ విద్యార్థులకు ఉదయం అల్పాహారం అందించనున్నారు. గ్రామ సర్పంచ్ బత్తిని రవీందర్ గౌడ్ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు....