Monday, November 30, 2026
Homeతెలంగాణఆపదలో నేనున్నానంటూ.. ఆపన్నులకు అండగా పాపిశెట్టి రాము!

ఆపదలో నేనున్నానంటూ.. ఆపన్నులకు అండగా పాపిశెట్టి రాము!

📰 Generate e-Paper Clip

  • తొమ్మిది మండలాల్లో సేవా పరిమళం.. పేద కుటుంబాలకు ఆర్థిక భరోసా

ఆమనగల్లు, నవంబర్‌ 6 (చైతన్యగళం): కష్టం ఎవరిదైనా.. కన్నీరు ఎవరిదైనా.. ఆపదలో ఉన్నవారికి అండగా నిలవాలనే సంకల్పంతో ముందుకు సాగుతున్నారు ఆమనగల్లు మున్సిపాలిటీ కౌన్సిలర్ పాపిశెట్టి  రాము. కల్వకుర్తి నియోజకవర్గంలోని తొమ్మిది మండలాల పరిధిలో నిరుపేద కుటుంబాలకు తనవంతు ఆర్థిక సహాయం అందిస్తూ మానవత్వానికి నిలువెత్తు నిదర్శనంగా నిలుస్తున్నారు.

అనారోగ్యంతో బాధపడుతూ వైద్య ఖర్చులు భరించలేని వారికి వైద్య సహాయం.. తల్లిదండ్రులను కోల్పోయిన విద్యార్థులకు చదువుల భరోసా.. కుటుంబ పెద్దను కోల్పోయిన బాధితులకు ఆర్థిక అండ.. ఇల్లు లేక ఇబ్బందులు పడుతున్న నిరుపేదలకు చేయూత.. ఇలా అవసరాన్ని గుర్తించి ఆపన్నులను ఆదుకుంటున్నారు. ఒక గ్రామానికో, ఒక మండలానికో పరిమితం కాకుండా నియోజకవర్గవ్యాప్తంగా సేవా కార్యక్రమాలను కొనసాగిస్తున్నారు.

కులమత, ప్రాంతీయ భేదాలకు అతీతంగా కష్టాల్లో ఉన్నవారికి అండగా నిలవడమే తన లక్ష్యంగా ఆయన సేవా ప్రస్థానం సాగుతోంది. సంపాదనలో కొంత భాగాన్ని తోటి మనుషుల కన్నీళ్లు తుడిచేందుకు వినియోగించడమే నిజమైన మానవత్వమనే సందేశాన్ని తన సేవల ద్వారా చాటుతున్నారు. ఆపద సమయంలో అండగా నిలిచే ఆపన్నహస్తంగా పాపిశెట్టి రాము మరిన్ని సేవా కార్యక్రమాలు చేపట్టి పేదల జీవితాల్లో వెలుగులు నింపాలని నియోజకవర్గ ప్రజలు ఆకాంక్షిస్తున్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install CG News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!