మూడు మండలాలను కరువు ప్రాంతాలుగా ప్రకటించాలి

హుస్నాబాద్, నవంబర్ 3 (చైతన్యగళం): హుస్నాబాద్ నియోజకవర్గంలోని సిద్దిపేట జిల్లా పరిధిలో ఉన్న హుస్నాబాద్, కోహెడ, అక్కన్నపేట మండలాలను కరువు మండలాలుగా ప్రకటించాలని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ముఖ్యమంత్రికి లేఖ రాశారు. ఎల్‌నినో ప్రభావంతో ఆయా మండలాల్లో సరైన వర్షాలు కురవక తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయని, దీంతో రైతులు, ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని మంత్రి పేర్కొన్నారు. వర్షాభావ పరిస్థితుల కారణంగా వ్యవసాయ రంగంపై తీవ్ర...