అంబేద్కర్ ఆశయాల సాధనకు మరింత కృషి చేస్తా
తెలంగాణ రాష్ట్ర అంబేద్కర్ సంఘం ఉపాధ్యక్షుడిగా గొర్రె థామస్ ఏకగ్రీవ ఎన్నిక ఎల్కతుర్తి, అక్టోబర్ 25 (చైతన్యగళం): తెలంగాణ రాష్ట్ర అంబేద్కర్ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా ఎల్కతుర్తి మండలం దామెర గ్రామానికి చెందిన గొర్రె థామస్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ మేరకు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వెల్మకంటి దయాకర్ ప్రకటించి, థామస్‌కు నియామక పత్రాన్ని అందజేశారు. గొర్రె థామస్ గతంలో హనుమకొండ జిల్లా అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వహిస్తూ సంఘం అభివృద్ధికి, బడుగు బలహీన వర్గాల హక్కుల సాధనకు, డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ ఆశయాల ప్రచారానికి...