Monday, November 16, 2026
Homeతెలంగాణరంగారెడ్డికందుకూరులో రజక సంఘం ఆధ్వర్యంలో ‘అలాయ్‌ బలాయ్‌’ వేడుకలు

కందుకూరులో రజక సంఘం ఆధ్వర్యంలో ‘అలాయ్‌ బలాయ్‌’ వేడుకలు

📰 Generate e-Paper Clip

  • రజకుల ఐక్యతతోనే అభివృద్ధి సాధ్యం.. చాకలి ఐలమ్మ స్ఫూర్తితో ముందుకు సాగాలి

కందుకూరు, అక్టోబర్‌ 25 (చైతన్యగళం): రజకుల ఐక్యత, అభివృద్ధి లక్ష్యంగా కందుకూరు ఎక్స్‌రోడ్డులోని శ్రీశైలం జాతీయ రహదారి సమీపంలో రజక అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో ‘అలాయ్‌ బలాయ్‌’ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మహేశ్వరం మార్కెట్‌ కమిటీ ఉపాధ్యక్షుడు సీహెచ్‌ యాదయ్య ముఖ్య అతిథిగా హాజరయ్యారు. రజక అభివృద్ధి సంస్థ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఏ. రాములు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా రాములు మాట్లాడుతూ కందుకూరులో రజకుల ‘అలాయ్‌ బలాయ్‌’ కార్యక్రమాన్ని నిర్వహించడం సంతోషంగా, గర్వంగా ఉందన్నారు. రజాకార్లు, దోపిడీదారులపై పోరాడిన వీరవనిత చాకలి ఐలమ్మ స్ఫూర్తిని వారసత్వంగా స్వీకరించి, రజకులంతా ఐకమత్యంతో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. ఐక్యతతోనే సామాజికంగా, ఆర్థికంగా అభివృద్ధి సాధించగలమని పేర్కొన్నారు.

జనాభాలో గణనీయమైన వాటా కలిగిన బీసీ వర్గాలన్నీ కలిసికట్టుగా ఒకే వేదికపైకి వచ్చి రాజకీయ సాధికారత దిశగా అడుగులు వేయాలని కోరారు. రానున్న ఎన్నికల్లో వార్డు సభ్యుల స్థాయి నుంచి శాసనసభ్యులు, పార్లమెంట్‌ సభ్యుల స్థాయి వరకు బీసీలు రాజకీయంగా ఎదగాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో బీసీ రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు ఎగ్గిడి సత్తయ్య, మహేశ్వరం మార్కెట్‌ కమిటీ మాజీ ఉపాధ్యక్షుడు ఉప్పునూతల శ్రీనివాస్‌, కుమారస్వామి, సహకార సంఘం డైరెక్టర్‌ పొట్టి ఆనంద్‌కుమార్‌, రజక అభివృద్ధి సంస్థ జిల్లా ప్రధాన కార్యదర్శి వెంకటేష్‌ తదితరులు పాల్గొన్నారు. రజకుల ఐక్యత, సామాజిక అభివృద్ధిని చాటిచెప్పేలా కార్యక్రమాన్ని నిర్వహించారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install CG News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!