పూల పండుగ.. బతుకమ్మ సంబురం
మానకొండూరు మండలంలో ఘనంగా సద్దుల బతుకమ్మ వేడుకలు గంగిపెల్లిలో బతుకమ్మలకు బహుమతుల ప్రదానం మానకొండూరు, అక్టోబర్ 19 (చైతన్యగళం): పూల సోయగాలు.. బతుకమ్మ పాటలు.. కోలాటాల సందడితో మానకొండూరు మండలంలోని పలు గ్రామాలు పండుగ శోభను సంతరించుకున్నాయి. ఆదివారం నిర్వహించిన సద్దుల బతుకమ్మ వేడుకల్లో మహిళలు, యువతులు, చిన్నారులు ఉత్సాహంగా పాల్గొన్నారు. రంగురంగుల పూలతో బతుకమ్మలను అందంగా పేర్చి గౌరమ్మకు ప్రత్యేక పూజలు చేశారు. సంప్రదాయ దుస్తుల్లో ముస్తాబైన ఆడపడుచులు బతుకమ్మల చుట్టూ చేరి పాటలు పాడుతూ, కోలాటాలు ఆడుతూ సందడి చేశారు. అనంతరం...