కాచాపూర్‌కు గౌరవెల్లి కాలువ నీరు

1,100 ఎకరాలకు సాగునీరు.. రూ.44.70 లక్షలతో దేవుల చెరువు పునరుద్ధరణ: మంత్రి పొన్నం కోహెడ, అక్టోబరు 6 (చైతన్యగళం): కాచాపూర్‌, సీసీపల్లి గ్రామాలకు చెందిన సుమారు 1,100 ఎకరాలకు సాగునీరు అందించేలా గౌరవెల్లి కాలువ నీటిని తీసుకువచ్చేందుకు చర్యలు చేపడుతున్నామని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌ తెలిపారు. కాచాపూర్‌లో నిర్వహించిన ‘పల్లెపల్లెకు పొన్నంఅన్న.. పల్లెపల్లెలో ప్రజాపాలన’ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఆపరేషన్‌ అండ్‌ మెయింటెనెన్స్‌ నిధులతో రూ.44.70 లక్షలతో చేపట్టిన దేవుల చెరువు పునరుద్ధరణ పనులను ప్రారంభించారు. గ్రామస్థులతో...