మహబూబాబాద్ రైల్వే స్టేషన్‌ను పరిశీలించిన జీఎం
అమృత్ భారత్ పనుల పరిశీలన.. అదనపు సౌకర్యాలపై దృష్టి మహబూబాబాద్, అక్టోబరు 2 (చైతన్యగళం): జిల్లా కేంద్రంలోని రైల్వే స్టేషన్‌లో అమృత్ భారత్ పథకం కింద జరుగుతున్న అభివృద్ధి పనులను దక్షిణ మధ్య రైల్వే జీఎం సంజయ్‌కుమార్ శ్రీవాస్తవ పరిశీలించారు. ఈ సందర్భంగా స్టేషన్ ఆవరణలో మొక్కలు నాటి, ప్రయాణికులు, పట్టణ ప్రజలతో పర్యావరణ పరిరక్షణపై ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం జూట్ సంచులను పంపిణీ చేశారు. స్టేషన్‌లోని సమస్యలను పరిశీలించి అవసరమైన అభివృద్ధి పనులకు ప్రణాళిక రూపొందిస్తామని జీఎం తెలిపారు. ప్రయాణికులకు అదనపు సౌకర్యాలు...