Tuesday, September 29, 2026
Homeతెలంగాణఉల్లాసం పరీక్షకు 13,177 మంది హాజరు

ఉల్లాసం పరీక్షకు 13,177 మంది హాజరు

📰 Generate e-Paper Clip

  • 91.13 శాతం హాజరు నమోదు

కరీంనగర్‌, సెప్టెంబరు 28 (చైతన్య గళం): కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మార్గదర్శకాల మేరకు నిర్వహించిన ఉల్లాసం అక్షరాస్యత పరీక్షకు కరీంనగర్‌ జిల్లాలో 13,177 మంది అభ్యాసకులు హాజరైనట్లు మెప్మా ప్రాజెక్టు డైరెక్టర్‌ జి. స్వరూపరాణి తెలిపారు.

జిల్లాలోని నాలుగు పట్టణ స్థానిక సంస్థల పరిధిలో 81 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేసి 14,459 మంది హాజరయ్యేలా లక్ష్యంగా పెట్టుకున్నారు. వీరిలో 1,282 మంది గైర్హాజరు కాగా 91.13 శాతం హాజరు నమోదైంది. పరీక్ష విజయవంతంగా నిర్వహించేందుకు మున్సిపల్‌ కమిషనర్లు, టీఎంసీలు, కాస్ట్‌, క్లర్ప్స్‌, రిప్స్‌ సమన్వయంతో ముందస్తు అవగాహన, ఇంటింటి సంప్రదింపులు చేపట్టినట్లు తెలిపారు.

ఉల్లాసం ద్వారా చదవడం, రాయడం, సంఖ్యాజ్ఞానంతో పాటు జీవితానికి అవసరమైన ప్రాథమిక నైపుణ్యాలను అభివృద్ధి చేయడం లక్ష్యమని స్వరూపరాణి పేర్కొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install CG News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!