ఉల్లాసం పరీక్షకు 13,177 మంది హాజరు

91.13 శాతం హాజరు నమోదు కరీంనగర్‌, సెప్టెంబరు 28 (చైతన్య గళం): కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మార్గదర్శకాల మేరకు నిర్వహించిన ఉల్లాసం అక్షరాస్యత పరీక్షకు కరీంనగర్‌ జిల్లాలో 13,177 మంది అభ్యాసకులు హాజరైనట్లు మెప్మా ప్రాజెక్టు డైరెక్టర్‌ జి. స్వరూపరాణి తెలిపారు. జిల్లాలోని నాలుగు పట్టణ స్థానిక సంస్థల పరిధిలో 81 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేసి 14,459 మంది హాజరయ్యేలా లక్ష్యంగా పెట్టుకున్నారు. వీరిలో 1,282 మంది గైర్హాజరు కాగా 91.13 శాతం హాజరు నమోదైంది. పరీక్ష విజయవంతంగా నిర్వహించేందుకు మున్సిపల్‌ కమిషనర్లు,...