జిల్లా కబడ్డీ ఛాంపియన్‌గా హుస్నాబాద్
17 ఏళ్ల బాలుర విభాగంలో దుబ్బాకపై విజయం సిద్దిపేట, సెప్టెంబరు 25 (చైతన్యగళం): సిద్దిపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో శుక్రవారం నిర్వహించిన 70వ జిల్లా స్థాయి పాఠశాలల కబడ్డీ పోటీల్లో హుస్నాబాద్ మండల జట్టు సత్తా చాటింది. 17 ఏళ్ల బాలుర విభాగంలో ఫైనల్‌లో దుబ్బాక మండల జట్టుపై విజయం సాధించి జిల్లా ఛాంపియన్‌గా నిలిచింది. ఈ సందర్భంగా హుస్నాబాద్ ఎస్‌జీఎఫ్ కార్యదర్శి ఆర్.శ్రీనివాస్ క్రీడాకారులను అభినందించారు. జిల్లా ఛాంపియన్‌గా నిలిచిన జట్టుకు మంత్రి పొన్నం ప్రభాకర్, మున్సిపల్ చైర్‌పర్సన్ దండి లక్ష్మి,...