Tuesday, September 22, 2026
Homeతెలంగాణబస్వాపూర్‌లో వైభవంగా వినాయక చవితి ఉత్సవాలు

బస్వాపూర్‌లో వైభవంగా వినాయక చవితి ఉత్సవాలు

📰 Generate e-Paper Clip

ఆరవ రోజు ప్రత్యేక పూజలు.. భక్తులకు తీర్థప్రసాద వితరణ

కోహెడ, సెప్టెంబర్‌ 21 (చైతన్యగళం): సిద్ధిపేట జిల్లా కోహెడ మండలం బస్వాపూర్‌లో వినాయక చవితి ఉత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా ఆరవ రోజు గణనాథుడికి ప్రత్యేక పూజలు నిర్వహించి, స్వామివారిని విశేషంగా అలంకరించారు.

వేముల నరేష్‌–వర్షిని, తాటిపాముల సత్యనారాయణ–కరుణ, వర్కుల సంతు–స్వప్న దంపతుల ఆధ్వర్యంలో భక్తులకు తీర్థప్రసాదాలు, ప్రసాద వితరణ చేపట్టారు. గ్రామంతో పాటు పరిసర ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చి గణనాథుడిని దర్శించుకుని ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు.

వేద పండితుడు చందు ఆధ్వర్యంలో పూజా కార్యక్రమాలు నిర్వహించగా.. రాజేష్‌, శ్రీనివాస్‌, వికాస్‌, తిరుపతి తదితరులు ఏర్పాట్లలో పాల్గొన్నారు. భక్తులకు ఇబ్బందులు కలగకుండా నిర్వాహకులు సౌకర్యాలు కల్పించడంతో గ్రామంలో పండగ వాతావరణం నెలకొంది.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install CG News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!