మట్టి గణపతినే పూజిద్దాం

పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ సహకరించాలి: డా. నిచ్చనమెట్ల రాజేంద్రప్రసాద్‌ మహబూబ్‌నగర్‌, సెప్టెంబర్‌ 21 (చైతన్యగళం): పర్యావరణ పరిరక్షణతో పాటు నీటి కాలుష్యాన్ని నివారించేందుకు ప్రతి ఒక్కరూ మట్టి గణపతి విగ్రహాలను పూజించాలని పలు అవార్డుల గ్రహీత డా. నిచ్చనమెట్ల రాజేంద్రప్రసాద్‌ సూచించారు. వినాయక చవితి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా పాలమూరు బ్రహ్మానవాడి ఆర్యవైశ్య యువజన సంఘం ఆధ్వర్యంలో ప్రతిష్ఠించిన గణనాథుడికి ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్యవైశ్య యువజన సంఘం ప్రతినిధులు రాజేంద్రప్రసాద్‌ను శాలువాతో సత్కరించి తీర్థప్రసాదాలు అందజేశారు. అనంతరం...