నందికొట్కూరు, సెప్టెంబరు 14 (చైతన్యగళం): వినాయక చవితి సందర్భంగా నందికొట్కూరు పట్టణంలోని నీలిశికారి కాలనీలో ఏర్పాటు చేసిన గణనాథుడిని ఎమ్మెల్యే గిత్త జయసూర్య సోమవారం దర్శించుకున్నారు. వినాయకుడికి హారతి ఇచ్చి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా పట్టణ ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు.

ఎమ్మెల్యే మాట్లాడుతూ విఘ్నాలను తొలగించి సమస్త శుభాలను ప్రసాదించే విఘ్నేశ్వరుడి కృపతో నియోజకవర్గ ప్రజల ప్రతి ఇంటా సుఖశాంతులు, ఆనందం వెల్లివిరియాలని ఆకాంక్షించారు. ప్రథమ పూజ్యుడైన గణనాథుడి ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని కోరుకున్నట్లు తెలిపారు.
కార్యక్రమంలో నందికొట్కూరు పట్టణ టీడీపీ నాయకులు, కార్యకర్తలు, భక్తులు పాల్గొన్నారు.
