Sunday, September 13, 2026
Homeతెలంగాణకరీంనగర్గణేష్‌ ఉత్సవ సమితి నూతన కార్యవర్గం ఎన్నిక

గణేష్‌ ఉత్సవ సమితి నూతన కార్యవర్గం ఎన్నిక

📰 Generate e-Paper Clip

  • విశ్వహిందూ పరిషత్‌ ఆధ్వర్యంలో కార్యవర్గం ఏర్పాటు

గోదావరిఖని, సెప్టెంబర్‌ 13 (చైతన్యగళం): గణేష్‌ ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు విశ్వహిందూ పరిషత్‌ ఆధ్వర్యంలో గోదావరిఖనిలో నూతన గణేష్‌ ఉత్సవ సమితి కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. ప్రతి ఏడాది మాదిరిగానే ఈ ఏడాది కూడా ఉత్సవాల నిర్వహణ కోసం కమిటీని ఏర్పాటు చేశారు.

గణేష్‌ ఉత్సవ సమితి అధ్యక్షుడిగా కొల్లూరి శ్రీనివాస్‌, కార్యదర్శిగా రావుల శ్రీనివాస్‌, కోశాధికారిగా నేరేడు కొమ్మ వెంకటస్వామిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన విభాగ్‌ కార్యదర్శి అయోధ్య రవన్న నూతన కార్యవర్గాన్ని ప్రకటించారు.

సమావేశంలో నగర కార్యదర్శి మునిగాల సంపత్‌, జిల్లా సహ కార్యదర్శి అడిగొప్పల రాజు, పిన్నింటి శ్రీనివాస్‌రెడ్డి, బండ సమ్మన్న, మోడెం సురేందర్‌, కుర్మ సతీష్‌, మేడగోని రవీందర్‌, ఆరెల్లి జలంధర్‌, చక్రపాణి, అరవింద్‌, శివ, బాలు, మహేందర్‌, చందు, లలితక్క, భవాని, ఇందిర, స్వాతి తదితర వివిధ బాధ్యులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install CG News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!