Monday, September 14, 2026
Homeతెలంగాణప్రపంచ ఆర్థిక వ్యవస్థలో కొత్త సమీకరణాలకు బ్రిక్స్‌ దిక్సూచి

ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో కొత్త సమీకరణాలకు బ్రిక్స్‌ దిక్సూచి

📰 Generate e-Paper Clip

  • న్యూఢిల్లీ బ్రిక్స్‌ సమావేశాల నిర్వహణ భారత్‌ శక్తిసామర్థ్యాలకు నిదర్శనం: శంతన్‌ రామరాజు

మహబూబాబాద్, సెప్టెంబర్ 12(చైతన్యగళం)‌: ప్రపంచ రాజకీయ, ఆర్థిక సమీకరణాలను ప్రభావితం చేసే స్థాయిలో బ్రిక్స్‌ దేశాల కూటమి ఎదుగుతోందని జాతీయ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి శంతన్‌ రామరాజు అన్నారు. న్యూఢిల్లీలో బ్రిక్స్‌ సమావేశాలను విజయవంతంగా నిర్వహించడం భారత్‌ శక్తిసామర్థ్యాలకు నిదర్శనమని ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
ప్రపంచ జనాభా, ఆర్థిక వ్యవస్థలో గణనీయమైన వాటా కలిగిన బ్రిక్స్‌ దేశాలు అంతర్జాతీయంగా కీలక శక్తిగా ఎదుగుతున్నాయని తెలిపారు. అమెరికా, ఐరోపా దేశాల ఆధిపత్యానికి ప్రత్యామ్నాయంగా బ్రిక్స్‌ కూటమి బలపడుతోందని పేర్కొన్నారు. డాలర్‌ ఆధిపత్యానికి సవాల్‌ విసురుతూ సభ్యదేశాల మధ్య స్థానిక కరెన్సీల్లో వాణిజ్యాన్ని ప్రోత్సహించాలన్న ఆలోచన ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో కొత్త మార్పులకు దారితీయవచ్చని అభిప్రాయపడ్డారు. బ్రిక్స్‌ దేశాల మధ్య ఐక్యతను పెంపొందించేందుకు భారత్‌ చేస్తున్న కృషి అభినందనీయమన్నారు. న్యూఢిల్లీలో ఇంతటి అంతర్జాతీయ స్థాయి సమావేశాన్ని నిర్వహించడం ద్వారా భారత్‌ ప్రపంచానికి తన సామర్థ్యాన్ని చాటిందని అన్నారు. వివిధ దేశాలతో దౌత్య, వాణిజ్య సంబంధాలను కొనసాగిస్తూ బ్రిక్స్‌ వేదికపై కీలక దేశాలకు ఆతిథ్యం ఇవ్వడం భారత విదేశాంగ విధానంలోని వ్యూహాత్మకతను ప్రతిబింబిస్తోందని పేర్కొన్నారు. బ్రిక్స్‌ సమావేశాల్లో భారత్‌ ప్రతిపాదించిన అంశాలకు సభ్యదేశాల నుంచి ఏకాభిప్రాయం లభించడం శుభపరిణామమన్నారు. చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌ భారత్‌కు రావడం కూడా బ్రిక్స్‌ ప్రాధాన్యతను తెలియజేస్తోందని తెలిపారు. న్యూఢిల్లీ బ్రిక్స్‌ సమావేశాలు భారత్‌ ప్రతిష్ఠను మరింత పెంచాయని, భవిష్యత్‌ ప్రపంచానికి బ్రిక్స్‌ ఒక ఆశాకిరణంగా నిలుస్తుందని శంతన్‌ రామరాజు అన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install CG News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!