- 11 వరకు గేమ్స్ అండ్ స్పోర్ట్స్ సెలెక్షన్స్
యాచారం, సెప్టెంబర్ 7 (చైతన్యగళం): యాచారం మండల పరిధిలోని ప్రభుత్వ, ప్రైవేటు, గురుకుల, కేజీబీవీ పాఠశాలల విద్యార్థినీ, విద్యార్థులకు ఈ నెల 9, 10, 11 తేదీల్లో ఎస్జీఎఫ్ మండల స్థాయి క్రీడా పోటీలు, గేమ్స్ అండ్ స్పోర్ట్స్ సెలెక్షన్స్ నిర్వహించనున్నట్లు ఎస్జీఎఫ్ మండల ఇన్చార్జి ఎస్ఏ (పీడీ), జెడ్పీహెచ్ఎస్ మెదిపల్లి పాఠశాల ఉపాధ్యాయుడు వి.భాస్కర్ తెలిపారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మండల స్థాయి క్రీడా పోటీలు నక్కగుట్టలోని సెయింట్ గ్రిగోరియస్ పబ్లిక్ స్కూల్లో నిర్వహించనున్నట్లు తెలిపారు. యాచారం మండలంలోని అన్ని పాఠశాలల పీఈటీలు, పీడీలు తప్పనిసరిగా పాల్గొని క్రీడా పోటీలను విజయవంతం చేయాలని కోరారు.
విద్యార్థులు క్రీడాస్ఫూర్తితో పోటీల్లో పాల్గొని తమ ప్రతిభను చాటుకోవాలని ఆయన సూచించారు.
